కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) జిల్లా పర్వతగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తూనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండెపోటు (Heart Attack)తో మృతి చెందాడు. సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (46) టూక్యా నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం పాఠశాలకు హాజరైన ఆయన తరగతి గదిలో పాఠం చెబుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలారు. ఈ ఘటనను గమనించిన విద్యార్థులు ఇతర ఉపాధ్యాయులు, స్థానికులకు సమాచారం అందించారు. వెంటనే ఆయనను నెక్కొండలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, చంద్రశేఖర్ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Read Also: తెలంగాణలో రోడ్లకు మహర్ధశ : అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన
Follow Us On: Instagram

