కలం, జనగామ : జనగామ (Jangaon) మండల కేంద్రంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బీఆర్ఎస్(BRS) నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆయన శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయాలని కోరారు.
జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి మాట్లాడుతూ, దళితుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిపై (Kaushik Reddy) కఠిన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే పదవి నుంచి వెంటనే తొలగించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకులు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: సగం ఆదాయం జీతాలు, పెన్షన్లకే.. అంచనా చేరని లక్ష్యం..!
Follow Us On: X(Twitter)

