Mobile Popup Ad
Mobile Popup Ad

తెలుగు ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక : డిప్యూటీ సీఎం భట్టి

కలం, వెబ్ డెస్క్ : నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత అని కొనియాడారు.

తెలుగు ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జ్ఞాపకాలు, ఆయన ప్రజల కోసం చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. తెలుగు ఆత్మగౌరవానికి ఆయన ఒక ప్రతీకగా నిలిచారని భట్టి గుర్తు చేశారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర భావి తరాలకు స్ఫూర్తిదాయకమని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.

Read Also: అన్నీ ఒకే చోట.. ప్రతి పౌరుడికి ‘సమగ్ర సంక్షేమ కార్డు’ : సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>