కలం, వెబ్ డెస్క్: ఏపీలో ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund)లో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితులకు పూర్తి సాయం అందకుండా మధ్యలోనే పలువురు అధికార పార్టీ వ్యక్తులు చేతివాటం చూపించడం విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా రాజంపేట (Rajampet)లో ఓ వృద్ధుడికి అందాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో జరిగిన మోసం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేటకు (Rajampeta) చెందిన తుంటి ఎల్లయ్య ఓ ప్రమాదంలో కన్ను కోల్పోయాడు. తిరుపతితో పాటు చెన్నైలో చికిత్స చేసుకున్నాడు. దీనికి సంబంధించి రూ.35 లక్షల వరకు ఖర్చయ్యింది. తర్వాత ఆర్థిక సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. బాధితుడికి రూ.14 లక్షలు మంజూరయ్యాయి. దీంతో స్థానిక టీడీపీ నేతలు డబ్బులు ఇప్పిస్తామని ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. బ్యాంకులో సంతకాలు కూడా పెట్టించుకున్నారు. డబ్బులు అకౌంట్ పడ్డాయని చెప్పారు.
తర్వాత ఇంటికి వెళ్లిన ఎల్లయ్య తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాడు. తన అకౌంట్‌లో రూ.14 లక్షలు పడ్డది వాస్తవమే.. కానీ, ఆ వెంటనే 20 నిమిషాల వ్యవధిలో రూ.8 లక్షలు వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి. బ్యాంకుకు వెళ్లి అడగగా వేణుగోపాల్ అనే వ్యక్తి ఖాతాకు రూ.8 లక్షలు బదిలీ అయినట్లు అధికారులు వెల్లడించారు. వేణు గోపాల్ టీడీపీ అనుబంధ సంస్థ అయిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాడు. దీంతో ఎల్లయ్య టీడీపీ నేతలను నిలదీశాడు. సదరు వ్యక్తులు తమకు కూడా ఖర్చులు ఉంటాయని, అందరికీ సీఎంఆర్ఎఫ్‌లో (CM Relief Fund) పర్సెంటేజీలు ఇవ్వాలని చెప్పడంతో షాకయ్యాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఎల్లయ్య కోరుతున్నాడు.
సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల్లో టీడీపీ నేతల చేతివాటం!
-రాజంపేటలో రోడ్డు ప్రమాదంతో కన్ను కోల్పోయిన బాధితుడు ఎల్లయ్యకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.14 లక్షలు మంజూరు
-సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి బ్యాంకుకు తీసుకెళ్లి.. ఎల్లయ్య వద్ద సంతకాలు పెట్టించుకుని పంపించిన… pic.twitter.com/IxDOSGpGLh— Kalam Daily (@kalamtelugu) April 8, 2026
Read Also: ఎన్నాళ్లీ ‘డోలీ’ మోతలు.. ఏపీలో మారని గిరిజన బతుకులు
Follow Us On : WhatsApp

