Mobile Popup Ad
Mobile Popup Ad

భూపాలపల్లిలో గుట్టుగా గుడుంబా దందా.. పోలీసుల మెరుపు దాడులు

కలం, వరంగల్ బ్యూరో: పోలీసులు దాడులు చేస్తున్నా మారుమూల పల్లెల్లో గుడుంబా తయారీకి అడ్డకట్ట పడటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా తయారీ చేస్తూ జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి (Jayashankar Bhupalpally) ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు మల్హర్ రావు మండలం కొయ్యూరు పోలీస్‌లు అక్రమ గుడుంబా (Liquor) తయారీ కేంద్రాలపై దాడులు జరిగాయి. ఈ మేరకు కొండంపేట గ్రామానికి చెందిన కొరకాని సమ్మయ్య గుడుంబా తయారుచేస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి దాదాపు 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన చీర్ల రాజేశ్వరి గుడుంబా తయారు చేస్తుండగా పట్టుబడింది. ఆమె వద్ద నుంచి 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, సుమారు 50 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Read Also: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో మందుల గందరగోళం..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>