కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ నుంచి అభ్యర్థుల లిస్ట్ ఖరారు అయింది. టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు (TDP Rajya Sabha Candidates) గా సానా సతీష్, భాష్యం రామ కృష్ణ, చింతకాయల విజయ్ పేర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు ఏపీ సీఎం, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు. కాగా, జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును ఇప్పటికే జనసేన ప్రకటించింది.

