Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం సభలో కాంగ్రెస్ నేతల ప్లకార్డులు.. పీసీసీ చీఫ్ సీరియస్

కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోహెడ మీటింగ్‌(Revanth Koheda Meeting)లో కొందరు కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై పీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. శనివారం సీఎం రేవంత్ రెడ్డి కోహెడలో నిర్వహించిన బహిరంగసభలో కొందరు నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. తమ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు నినాదాలు చేసినట్టు సమాచారం.

అయితే ప్లకార్డులు ప్రదర్శించింది ఏ నేతకు సంబంధించిన అనుచరులు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చాలా రోజులుగా మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన అనుచరులే ఈ పని చేశారా? అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే పీసీసీ చీఫ్ ఈ వ్యవహారంపై సీరియస్ అయినట్టు సమాచారం. క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>