TCS మతమార్పిడి కేసు.. ప్రధాన నిందితురాలు అరెస్టు

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీసీఎస్ నాసిక్ యూనిట్ లో బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసు (TCS Nasik Conversion Case) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్, సిట్ బృందం, పోలీసుల జాయింట్ ఆపరేషన్ తో 25 రోజులుగా పరారీలో ఉన్న నిదా ఖాన్ ను ఛత్రపతి శంభాజీనగర్‌లో అరెస్ట్ చేశారు. నేడు (శుక్రవారం) నిందితురాలిని నాసిక్ కోర్టులో హాజరు పరచనున్నారు. బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు, మహిళా ఉద్యోగులపై లైంగిక దాడి కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, టీసీఎస్ నాసిక్ యూనిట్ లో మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు జరిగినట్లు కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిగతా బాధితులు బయటకు వచ్చి వేధింపులపై గళమెత్తారు. ఆరోపణలపై నాసిక్ పోలీసులు కేసు నమోదు చేసి సిట్ ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటివరకు పోలీసులు 8మందిని అరెస్ట్ చేయగా, తాజాగా ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదాఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>