Mobile Popup Ad
Mobile Popup Ad

సికింద్రాబాద్‌లో దారుణం: బీటెక్ విద్యార్థి హత్య

కలం, వెబ్‌ డెస్క్ : సికింద్రాబాద్ (Secunderabad) సీతాఫల్‌మండి ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. జవహర్‌నగర్‌కు చెందిన యావన్ (23) అనే యువకుడు బీటెక్ మూడో ఏడాది చదువుతున్నాడు. అతను గత నాలుగేళ్లుగా సీతాఫల్‌మండికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు అతడిని పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ యావన్ తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ సదరు యువతిని తరచూ కలుస్తూ ఉండేవాడు.

ఈ క్రమంలో యువతి బంధువులు అతడిపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్నారు. నిన్న రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు యావన్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు యువకుడు ప్రయత్నించినప్పటికీ వదలకుండా వెంబడించి నడిరోడ్డుపైనే ఘాతుకానికి ఒడిగట్టారు. 17 చోట్ల కత్తిపోట్లు పడటంతో యావన్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>