బెంగాల్ ఫలితాలు.. ఈసీ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ (EC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఫలితాలు వెల్లడైన అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలకు అభ్యర్థులకు అనుమతి లేదని తెలిపింది. పశ్చిమ బెంగాల్ మొత్తం ఈ నిబంధన కొనసాగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

అలాగే, తమ ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారని పార్టీలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై తాము పరిశీలన చేస్తున్నామని.. త్వరగానే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చింది. కాగా, బెంగాల్ (West Bengal) లో 293 స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ 148 ను దాటిన బీజేపీ.. 181 చోట్ల లీడ్ లో కొనసాగుతోంది. మరోవైపు అధికార టీఎంసీ 109 స్థానాల్లో ముందంజలో ఉంది.

Read Also: పులి పిల్లల్లా పోరాడండి.. పార్టీ నేతలకు మమతా బెనర్జీ ఆదేశం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>