Mobile Popup Ad
Mobile Popup Ad

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా TVK.. చెన్నైలో సంబురాలు షురూ!

కలం, వెబ్​ డెస్క్​ : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టిస్తోంది. రాజకీయ అరంగేట్రం చేసిన తొలి ఎన్నికల్లోనే విజయ్ (Vijay) పార్టీ అనూహ్య విజయాల దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది.

సంబురాలు షురూ..

చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు పనైయూర్‌లోని విజయ్ నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తల సందడి ఆకాశాన్ని తాకుతోంది. తమ అభిమాన నటుడు రాజకీయాల్లోనూ ఘనవిజయం సాధించబోతున్నారనే ఆనందంతో అభిమానులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా చెన్నైలోని మెజారిటీ నియోజకవర్గాల్లో టీవీకే (TVK) అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుండటం విశేషం. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ విజయ్ పార్టీ సాధిస్తున్న ఈ విజయాలు తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపాయి. ప్రస్తుతం టీవీకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తూ గెలుపు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

Read Also: క్యూట్ వీడియో.. పెంగ్విన్ నడకను ఎక్కిరించిన కుక్క!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>