కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు వివాదస్పదమవుతోంది. విజయ్ (Vijay) సారథ్యంలోని టీవీకే పార్టీ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించన కూడా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్, వామపక్షాలు జత కట్టిన కూడా మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు సాధించకపోవడంతో టీవీకే ప్రభుత్వానికి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు. తమిళనాడు తాజా సంక్షోభంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) స్పందించారు.
తమిళనాడులో ఇప్పుడున్నది కృత్రిమ సంక్షోభమేనని వ్యాఖ్యానించారు. ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ని గవర్నర్ ఆహ్వానించి ఉండాల్సిందని చెప్పారు. అయితే అసెంబ్లీ పాత్రను గవర్నర్ పోషిస్తున్నారని.. తన ఇంటినే అసెంబ్లీగా భావించడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఈ క్రమంలోనే మళ్లీ ఎన్నికలు, రాష్ట్రపతి పాలన అనే అంశాలు వెలుగులోకి వస్తున్నాయని బాంబ్ పేల్చారు. అయితే గవర్నర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యబద్ధం కాదని అన్నారు. విజయ్ ఇప్పుడు కోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) సూచించారు.
Read Also: సీనియర్ కాళ్లు మొక్కిన ప్రధాని.. ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
Follow Us On: WhatsApp

