కలం, స్పోర్ట్స్: ఇండియా స్పోర్ట్స్ స్టార్స్ యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మ (Yashasvi Jaiswal – Shafali Verma) చిక్కుల్లో పడ్డారు. డోపింగ్ అంశంలో వారికి నేషనల్ డోపింగ్ ఏజెన్సీ (NADA) నోటీసులు అందించింది. డోప్ టెస్ట్ కోసం అధికారులు వచ్చిన సమయంలో వీరిద్దరు వారు ఉండాల్సన దగ్గర లేకపోవడమే ఈ నోటీసులకు కారణం. దీంతో వారికి నోటీసులు జారీ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది నాడా. ఏడు రోజుల్లోగా సరైన సమాధానం చెప్పకపోతే చిక్కులు తప్పవని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం, స్టార్ ఆటగాళ్లు తాము ఎక్కడ ఉంటున్నారో, ఏ గంటలో టెస్టుకు అందుబాటులో ఉంటారో ముందే చెప్పాలి. కానీ నవంబర్ 7, 2025న అధికారులు వెళ్లేసరికి షఫాలీ వర్మ అక్కడ లేరు. అదే విధంగా డిసెంబర్ 17, 2025న యశస్వి జైస్వాల్ కూడా తన లొకేషన్‌లో కనిపించలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనిపై సంజాయిషీ కోరినా వీరి నుంచి రిప్లై రాకపోవడంతో, నాడా దీనిని ‘మిస్డ్ టెస్ట్’గా రికార్డ్ చేసింది. ఇదే విషయాన్ని బీసీసీఐ, ఐసీసీకి కూడా రిపోర్ట్ చేసింది. వీరికి ఇది మొదటి హెచ్చరికే అయినప్పటికీ, పరిస్థితి సీరియస్ గానే ఉంది. ఎందుకంటే 12 నెలల కాలంలో ఇలా మూడుసార్లు టెస్టులకు దొరకకపోతే, అది డోపింగ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగిందని నిరూపించుకోలేకపోతే, రెండేళ్ల వరకు ఆట నుంచి దూరం కావాల్సి ఉంటుంది.
Read Also: బిట్‌కాయిన్ సునామీ: $80,000 రికార్డ్.. ఆగని బీటీసీఎఫ్ఐ క్రేజ్!
Follow Us On: WhatsApp

