పూరన్‌తో గొడవపై కృణాల్ క్లారిటీ..!

క‌లం, వెబ్‌డెస్క్: మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలు జరగడం కామనే. అయితే గురువారం నాటి మ్యాచ్‌లో పూరన్, కృణాల్ పాండ్యా (Krunal Pandya) మధ్య జరిగిన సీన్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఒక వీడియోలో పూరన్ (Nicholas Pooran) చాలా ఆవేశంగా కనిపిస్తూ కృణాల్ కాలర్ పట్టుకోవడం వైరల్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని అంతా భావించారు. ఈ ఊహాగానాలకు తెరదించుతూ కృణాల్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు విషయం చెప్పారు. లక్నో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కృణాల్, పూరన్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వైరల్ అయిన వీడియోలో పూరన్ సీరియస్ లుక్‌తో కృణాల్ కాలర్ పట్టుకోవడం కనిపించింది.

అయితే, ఆ వీడియో చివరలో వారిద్దరూ నవ్వుతూ కరచాలనం చేసుకోవడం అసలు ట్విస్ట్. దీనిపై కృణాల్ (Krunal Pandya) స్పందిస్తూ.. తమ మధ్య ఎలాంటి గొడవలు (లఫ్డా) లేవని, కేవలం ప్రేమ మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చారు. తన సోదరుడు పూరన్ 100 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నందుకు గర్వంగా ఉందని చెబుతూ.. తాను వేసిన బౌన్సర్ ఎలా ఉందంటూ సరదాగా ఆటపట్టించారు. దీనికి పూరన్ కూడా బదులిస్తూ కృణాల్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు.

Read Also: యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు నాడా నోటీసులు.. జరిగిందిదే..!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>