కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికల్లో (Tamil Nadu Elections) భాగంగా ఎన్డీయే పార్టీల మధ్య సీట్ల పంపకం కుదిరింది. బీజేపీకి 27 సీట్లు, పీఎంకేకు 18 సీట్లు, ఏఎంఎంకేకు 11 సీట్లు ఇచ్చేందుకు ఏఐడీఎంకే అంగీకరించింది. బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ సారి 7 సీట్లను అధికంగా దక్కించుకున్నది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. డీఎంకే, ఎన్డీయే కూటములు (NDA Alliance) హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ సారి దళపతి విజయ్ పార్టీ టీవీకే కూడా రంగంలో దిగుతోంది. దీంతో త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయని ముఖ్యమంత్రి స్టాలిన్ గట్టి నమ్మకంతో ఉన్నారు. డీఎంకే (DMK) బలహీనంగా ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశం. టీవీకే పోటీ చేస్తుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు లాభిస్తుందని డీఎంకే నేతలు భావిస్తున్నారు. అయితే డీఎంకే మీదున్న తీవ్రమైన వ్యతిరేకత తమను గెలిపిస్తుందని ఎన్డీయే కూటమి నేతలు భావిస్తున్నారు. పోటీపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత సంప్రదాయం ప్రకారం అధికార మార్పిడి ఉంటుందన్న అభిప్రాయాలు అన్నాడీఎంకే వర్గీయుల్లో వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Read Also: BRSపై సీతక్క ఫైర్.. పదేళ్లు ఏం చేశారంటూ ఆగ్రహం
Follow Us On: Instagram

