Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం విజయ్

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన ఆయనకు.. అసెంబ్లీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ప్రొటెం స్పీకర్ కరుప్పయ్య ఆయనతో శాసనసభ్యుడిగా ప్రమాణం చేయించారు. విజయ్ ఈ ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, నిబంధనల ప్రకారం ఒకటే సీటు నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండటంతో.. ఒక స్థానాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి.. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నారు.

బల నిరూపణ అయితేనే..

ప్రస్తుతం విజయ్ పార్టీకి సొంతంగా 108 స్థానాల బలం ఉంది. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలను కలుపుకుని ఆ సంఖ్య 120కి చేరింది. అసెంబ్లీలో ఈ నెల 13న నిరూపణ జరిగే అవకాశం ఉంది. దీనిలో నెగ్గితేనే.. విజయ్‌కు ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలన సాగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>