ప్రధాని మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భేటీ

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Tamil Nadu CM Vijay) బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (PM Modi) కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ సహకారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి విషయాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలు అవుతున్న వివిధ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారని సమాచారం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా జరిగిన ముఖ్యమైన సమావేశంగా భావిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఉన్న పెండింగ్ అంశాలు, నిధుల విడుదల, అభివృద్ధి ప్రాజెక్టుల వేగవంతం వంటి విషయాలపై కూడా చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ప్రధానమంత్రితో జరిగిన కీలక సమావేశాల్లో ఒకటిగా భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను వేగవంతం చేయడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యంగా ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విజయ్ తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సైతం విజయ్ భేటీ కాబోతున్నట్టు సమాచారం.

Read Also: ఇందిర‌మ్మ ఇండ్లు.. కేటీఆర్‌కు మంత్రి పొన్నం స‌వాల్‌!

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>