సీఎంగా విజయ్.. పూర్తిగా లుక్ మార్చిన దళపతి

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ (CM Vijay) మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాసేపటి కిందటే వేడుక జరిగే జవహర్ లాల్‌ నెహ్రూ స్టేడియం వద్దకు వచ్చిన దళపతికి.. రాష్ట్ర సీఎస్, డీజీపీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ లుక్ వైరలవుతోంది. సాధారణంగా తెల్ల చొక్కా, లైట్ ఆరెంజ్ కలర్ ప్యాంట్, చెప్పులు ధరించే విజయ్.. ప్రమాణ స్వీకారానికి మాత్రం స్పెషల్ లుక్‌లో వచ్చారు. తెల్ల చొక్కా, బ్లాక్ ప్యాంట్ వేసుకుని హాజరయ్యారు. ఇప్పటికే, విజయ్ తల్లిదండ్రులతో పాటు ఆయన కుటుంబసభ్యులు స్టేడియంలోకి వచ్చారు.

భారీ భద్రత ఏర్పాటు..

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసులు భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి నుంచే చుట్టుపక్కల బాంబ్ స్వ్యాడ్‌ తనిఖీలతో పాటు సాయుధ పోలీస్ బలగాలను కూడా రంగంలోకి దించారు. ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో.. అడుగడుగునా చెకింగ్‌ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>