కలం, సినిమా: డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెలంగాణలోని ఆదిలాబాద్లో ఉన్న బొగ్గు గుట్టల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న టాలీవుడ్ లేటెస్ట్ మూవీ భోగీ (Bhogi). ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో ఈ జోడీ శతమానం భవతి వంటి హిట్ మూవీలో నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే అనుపమ, శర్వా లుక్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే తెలంగాణ యాసలో ఉన్న ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ కానుందని అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. కానీ, సడెన్గా ట్రైలర్ లాంచ్ వాయిదా పడినట్లు చెప్పారు. దీంతో సినిమా విడుదల పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

