ఖమ్మం అభివృద్ధిపై శ్వేతపత్రం ఇవ్వాల్సిందే : వద్దిరాజు

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ఇక్కడి మంత్రులు శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju) డిమాండ్ చేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక శాఖల మంత్రులుగా ఉండి కూడా ఉమ్మడి జిల్లా అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. బడ్జెట్‌లో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు తెచ్చిన నిధులు, చేసిన ఖర్చుపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

మురసు తుపాను కారణంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 50 వేల ఎకరాలకు పైగా వరి, మిర్చి, పత్తి, ఉద్యానవన పంటలు దెబ్బతిని రైతన్నలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన శాఖల మంత్రులు ఇక్కడే ఉన్నప్పటికీ, వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి బీమాతో సంబంధం లేకుండా రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కరువు, తుఫానుతో అల్లాడుతున్న ఉమ్మడి జిల్లాను పట్టించుకోకుండా సీఎం, మంత్రులు కొడంగల్‌కే పరిమితం కావడం విచారకరమన్నారు. గతంలో దెబ్బతిన్న పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని, దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను వెంటనే బాగు చేయాలని కోరారు. బేతుపల్లి చెరువు అలుగులో కొట్టుకుపోయిన వారిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>