Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు కేబినెట్‌లోకి కాంగ్రెస్.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం!

కలం, వెబ్‌ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తన కేబినెట్‌ను విస్తరించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన మిత్రపక్షాలన్నింటికీ అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామంటూ ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఈ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులను కేటాయించారు. కాంగ్రెస్ తరపున విశ్వనాథన్, రాజేష్‌కుమార్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కడం దాదాపు ఖాయమైంది.

మరోవైపు ఇతర మిత్రపక్షాలైన ఐయూఎంఎల్ (IUML), వీసీకే (VCK) పార్టీలకు కూడా ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు తమ నిర్ణయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నాయి. కాగా, ఈ అధికార భాగస్వామ్యానికి దూరంగా ఉండాలని వామపక్షాలు నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి మిత్రపక్షాలను కలుపుకుంటూ సీఎం విజయ్ తీసుకుంటున్న ఈ నిర్ణయం తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు తెరలేపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>