తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు బీజేపీ నేత అన్నామలై (Annamalai) రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపింది. బీజేపీ సభ్యత్వానికి అన్నామలై రాజీనామాను అందించినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ప్రకటన వెలువరించారు. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణపై అన్నామలై ప్రకటించనున్నారు. తమిళనాడులో బీజేపీ పార్టీ బలపడటంతో అన్నామలై కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేయడం పార్టీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటనపై అన్నామలై ఎలా స్పందిస్తారనేది తమిళ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>