కలం, వెబ్ డెస్క్: తనకు దొరికిన విలువైన బంగారాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకుంది ఓ పారిశుద్ధ్య కార్మికురాలు. ఆమె నిజాయితీని ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పారిశుద్ధ్య కార్మికురాలికి తమిళ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్థీబన్ (Actor Parthiban) అరుదైన గౌరవం కల్పించారు. ఆమె నిజాయితీని మెచ్చి ఏకంగా ఆమె పాదాలకు నమస్కరించాడు. చెత్తను శుభ్రం చేసే క్రమంలో పద్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలికి విలువైన బంగారం దొరికింది. ఆ బంగారాన్ని తన వద్దే ఉంచుకోకుండా, యజమానులకు తిరిగి ఇచ్చి తన నిజాయితీని చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్థీబన్ ఆమెను ప్రత్యేకంగా అభినందించాలని నిర్ణయించుకున్నారు.
అందం అంటే కేవలం రూపం మాత్రమే కాదు, స్వచ్ఛమైన మనసు అని చాటుతూ ‘ప్రపంచ సుందరి’ (Miss World) కిరీటాన్ని అలంకరించారు. అనంతరం ఆమె పాదాలకు నమస్కరించాడు. మానవత్వానికి కులమతాలు, హోదాలు ఉండవని నిరూపిస్తూ పద్మ కాళ్లకు మొక్కాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్థీబన్ (Actor Parthiban) చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రియల్ హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: పీఎం స్పీచ్ లేకుండానే లోక్‌సభ ఆమోదం
Follow Us On: Instagram


