కలం, రఘునాథపల్లి : అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని స్టేషన్ ఘన్పూర్ (Station Ghanpur ) ఏసీపీ భీమ్ శర్మ, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడబెల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజల్ని కోరారు.
స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ భీమ్ శర్మ, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడబెల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం లింగాల గణపురం మండలాల రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రత కల్పించడం, ఆసాంఘిక కార్యక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు ముందున్నారన్నారు. ఎవరైనా ప్రజాజీవానికి భంగం కలిగించిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాకేష్ రెడ్డి, ఎస్సైలు నరేష్ యాదవ్, శ్రవణ్ కుమార్ గౌడ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

