Mobile Popup Ad
Mobile Popup Ad

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునికి దేహశుద్ధి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) లోని ఖాజీపురా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునికి, బాలిక బంధువులు దేహ శుద్ధి చేశారు. శనివారం ఖాజీపురా ప్రభుత్వ పాఠశాలలో అర్షద్ పాషా అనే హిందీ టీచర్ బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో స్కూల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

ఉపాధ్యాయుని వేధింపుల గురించి తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ఆగ్రహంతో టీచర్‌కు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>