‘పెద్ది ’ మూవీ సెట్స్‌కి టి20 వరల్డ్ కప్ చాంపియన్ తిలక్ వర్మ

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “పెద్ది”(Peddi) షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌ను టి20 వరల్డ్ కప్ చాంపియన్ తిలక్ వర్మ(Tilak Varma) సందర్శించారు. ఈ సందర్భంగా చిత్రీకరిస్తున్న స్పోర్ట్స్ సన్నివేశాలను ప్రత్యేకంగా వీక్షించారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సీన్స్‌ను చూసిన తిలక్ వర్మ..  వాటి చిత్రీకరణ స్థాయి, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌పై ప్రశంసలు కురిపించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.

టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్దం అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్  సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. మార్చి 27న చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో సూపర్ బజ్ ఏర్పడగా.. తిలక్ వర్మ సందర్శనతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>