వరంగల్ ప్రెస్‌ క్లబ్‌ ఎన్నికలు జరపాలని వినతి

కలం, హనుమకొండ: గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌ క్లబ్‌ (Warangal Press Club)కు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ డిజిటల్‌ మీడియా యూనియన్‌ డిమాండ్‌ చేసింది. 2022 డిసెంబర్‌లో ఎన్నికలు జరగ్గా, బై లా ప్రకారం 2024 డిసెంబర్‌తోనే కార్యవర్గం పదవీకాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సోమవారం హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్, డాక్టర్‌ సత్యశారదకు వినతిపత్రాలు అందజేసింది.

ఎన్నికల జాప్యంపై ప్రస్తుత కార్యవర్గం నుంచి వివరణ తీసుకొని, అర్హులైన సభ్యులతో ఓటర్ల జాబితా రూపొందించాలని యూనియన్‌ కోరింది. అవసరమైతే అడహక్‌ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అరెళ్లి కిరణ్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన నాగరాజు, కోశాధికారి పల్లె రవి వంశీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>