కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో భారత స్పిన్ మాంత్రికుడు అక్షర్ పటేల్(Axar Patel )కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేస్తూ, మూడో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రమాదకరమైన డారిల్ మిచెల్‌ను అవుట్ చేసి న్యూజిలాండ్‌ను కోలుకోలేని స్థితిలోకి నెట్టాడు.
ఇప్పటికే ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్‌లను పెవిలియన్ పంపిన అక్షర్, ఇప్పుడు మిచెల్ వికెట్ కూడా సాధించి ముచ్చటగా మూడో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ వేసిన ఫుల్ టాస్ బంతిని మిచెల్ డీప్ మిడ్ వికెట్ వైపు గట్టిగా బాదాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ ఏమాత్రం తడబడకుండా అత్యంత సులభమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 11 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసిన మిచెల్ ఇన్నింగ్స్ ముగిసింది.
మిచెల్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 12.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(Axar Patel )తన 2.6 ఓవర్ల కోటాలో 27 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి భారత విజయానికి బాటలు వేశారు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 31 పరుగులతో ప్రస్తుతం క్రీజులో పోరాడుతున్నాడు.

