Mobile Popup Ad
Mobile Popup Ad

అభిషేక్ సింఘ్వీ ఆస్తుల విలువ రూ. 2,860 కోట్లు

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) 2026 రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న ఆయన, తన భార్య అనితా సింఘ్వీతో కలిసి మొత్తం రూ. 2,860.36 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఆయన ఆదాయం గణనీయంగా పెరిగింది. 2020-21లో రూ. 158.44 కోట్లుగా ఉన్న ఆయన ఆదాయం, 2024-25 నాటికి రూ. 374.05 కోట్లకు చేరుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో ఆయన మొత్తం రూ. 1,500 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినట్లు వెల్లడైంది.

సింఘ్వీ ఆస్తుల్లో (Assets) అధిక భాగం రూ. 1,536.10 కోట్ల విలువైన చరాస్తులే ఉన్నాయి. ఇందులో రూ. 357.85 కోట్ల విలువైన ఫ్యామిలీ ట్రస్ట్ పెట్టుబడులు, రూ. 197.86 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, రూ. 203.13 కోట్ల ఏఐఎఫ్ ఫండ్స్, రూ. 140.85 కోట్ల PMS ఫండ్స్ ఉన్నాయి. వీటితో పాటు, ఆయన వద్ద సుమారు రూ. 25 కోట్ల విలువైన అరుదైన చిత్రలేఖనాలు, రూ. 8.17 కోట్ల విలువైన కరెన్సీ, రూ. 69.99 లక్షల నగదు, ఇతర ఆస్తులు ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>