ఆస్పత్రి నిర్లక్ష్యం.. అట్టపెట్టెలో శిశువు మృతదేహం పెట్టుకుని..

కలం, వెబ్ డెస్క్ : ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యంతో నవజాతశివువు మృతి చెందింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లా బంగ్రాసాయి గ్రామానికి చెందిన రామకృష్ణ హెమ్ బ్రామ్ భార్య రీటాకు మార్చి 7న పురిటినొప్పులు వచ్చాయి. దీంతో జిల్లాలోని చక్రధర్ పుర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రీటా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ కొద్దిసేపటికే శిశువు చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్టు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

కనీసం శిశువు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కూడా ఇవ్వలేదని.. దీంతో దగ్గర్లో దొరికిన అట్టపెట్టెలో తీసుకెళ్లినట్టు కుటుంబం చెబుతోంది. దీంతో ఆస్పత్రి తీరుపై పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>