కలం, నల్లగొండ బ్యూరో : పల్లె ప్రకృతి వనాల్లో పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లతో పాటు పనికొచ్చే మొక్కలను పెంచాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ (Nalgonda Collector) బి.చంద్రశేఖర్ (Chandrasekhar) తెలిపారు. ఆదివారం నల్లగొండ మండలం చందనపల్లి (Chandanapalli) గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పల్లె ప్రకృతి వనాలు (Palle Prakruthi Vanam) శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండే విధంగా నిర్వహించాలన్నారు.
గ్రామ ప్రజలు, పిల్లలు విశ్రాంతి తీసుకునేలా ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌ను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డంపింగ్ యార్డ్‌లోనే వేసేలా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి పనిచేయాలని కలెక్టర్ (Nalgonda Collector) తెలిపారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే గ్రామాలు మరింత అందంగా మారుతాయని పేర్కొన్నారు.
Read Also: ‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో రోల్ మోడల్‌గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు
Follow Us On : WhatsApp

