కలం డెస్క్ : సనాతన (Sanatan) ధర్మం పేరుతో సుప్రీంకోర్టు (Supreme Court) చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ (ఇప్పుడు మాజీ)పై చెప్పు విసిరిన న్యాయవాది రాకేశ్ కిషోర్‌పై (Advocate Rakesh Kishore) బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Bar Council) సస్పెన్షన్ వేటు వేసింది. రెండు రోజుల క్రితం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొన్నది. కోర్టు హాల్‌లో విచారణ జరుగుతున్న సమయంలో చెప్పు విసిరి దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందున 1961 అడ్వొకేట్స్ యాక్ట్ లోని నిబంధన మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు వివరించింది. సుప్రీంకోర్టు సహా హైకోర్టులు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునళ్ళు.. ఇలా ఏ న్యాయస్థానాల్లోనూ వాదించే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఢిల్లీ బార్ కౌన్సిల్ సైతం వెంటనే ఈ నిర్ణయాన్ని తన పరిధిలోని అన్ని కోర్టులకు తెలియజేసి ప్రాక్టీసింగ్ అడ్వొకేట్‌గా పనిచేయకుండా చూడాలని స్పష్టం చేసింది.
సీజే దయచూపినా.. బార్ కౌన్సిల్ సీరియస్ :
కేసును విచారిస్తున్న చీఫ్ జస్టిస్‌పైకి చెప్పు విసిరి దాడికి పాల్పడిన ఘటనను స్వయంగా జస్టిస్ బీఆర్ గవాయ్ సీరియస్‌గా తీసుకోకపోయినా బార్ కౌన్సిల్ మాత్రం ఘాటుగానే స్పందించింది. ఇలాంటి చర్యలతో నన్ను ప్రభావితం చేయలేరు.. నా దృష్టిని మళ్ళించలేరు.. అంటూ సీజీ చాలా సున్నితంగానే కామెంట్ చేశారు. న్యాయవాద వృత్తి గౌరవానికి భంగం కలిగించేలా, న్యాయస్థానాల డిగ్నిటీని మంటగలిగిపినట్లుగా భావించిన కౌన్సిల్ అడ్వొకేట్ రాకేశ్ కిషోర్‌కు (Advocate Rakesh Kishore) షోకాస్ నోటీసు కూడా జారీచేసింది. అడ్వొకేట్ చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు, కోర్టుల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున బార్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ షోకాస్ నోటీసుల్లో పేర్కొన్నది. వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు సైతం కౌన్సిల్ వెనకాడదని స్పష్టం చేసింది.
Read Also: హెచ్1బీ, హెచ్4 వీసా ఇంటర్వ్యూలు రద్దు
Follow Us On: Youtube


