epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫ్యూచర్ సిటీలో ఏమేం ఉన్నాయో తెలుసా?

కలం, వెబ్‌డెస్క్ : హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు తోడుగా నాలుగో నగరాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) పేరుతో రంగారెడ్డి జిల్లా పరిధిలో కొత్తనగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 (Telangana Rising Global Summit -2025)’ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించింది. అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ విస్తీర్ణమెంత?.. ఇందులో ఏమేం ఉంటాయనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్యలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని 56 గ్రామాలు, 7 మండలాలను కలిపి ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేసింది.

మొత్తం లక్షన్నర ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City)ని అభివృద్ధి చేయనున్నారు. 765 చదరపు విస్తీర్ణంతో 30వేల ఎకరాల్లో ఎకరాల్లో కోర్ ఏరియా ఉంటుంది. ఈ కోర్ ఏరియాలో కీలక సంస్థలు, పరిశ్రమలు, అధిక ప్రాధాన్యత గల రంగాలకు కేటాయించారు. ఇందులో ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యూకేషన్ హబ్, ఎంటర్టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్, లైఫ్ సైన్సెస్ హబ్ లు ఉంటాయి.

ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా 300ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ అభివృద్ధి చేయనున్నారు. ఏఐ సిటీలో టెక్నాలజీ పవర్ హౌజ్, ఇన్నోవేషన్ ల్యాబ్స్, స్టార్టప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కైలైన్ ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా 200 ఎకరాల్లో హెల్త్ సిటీలో మెడికల్ టూరిజం, వెల్ నెస్ సెంటర్లు, ఆస్పత్రులు నిర్మిస్తారు.

500ఎకరాల్లో ఎడ్యూకేషన్ హబ్, 3000వేల ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్ ఏర్పాటు చేస్తారు. ఎంటర్టైన్ మెంట్ హబ్ కోసం 100ఎకరాల్లో ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్, థీమ్ పార్క్, రిసార్ట్స్ జూలాజికల్ పార్స్ వస్తాయి. ఇవి ఫ్యూచర్ సిటీ వైపు మరింత ఆకర్షిస్తాయి. ఫ్యూచర్ సిటీకి పరిశ్రమలు, ఈవీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు రానున్నాయి. ఫ్యూచర్ సిటీని హైదరాబాద్ నగరంతో అనుసంధానించడానికి మెట్రోతో పాటు అనేక రవాణా సౌకర్యాలు కల్పిస్తారు. ప్రజలకు అత్యవసర సర్వీసులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు.

Read Also: ‘చెప్పు దెబ్బ’తో అసలుకే ఎసరు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>