Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ కు బిగ్ షాక్.. ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్..!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ (Vijay) ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ నెలకొంది. టీవీకే సర్కార్ కొలువు దీరడానికి కావాల్సిన బలం లేదని లోక్‌భవన్ అధికారులు అంటున్నారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కు ఐయూఎంల్, వీసీకే మద్దతు లేఖలు అందలేదు. 116 మంది సభ్యుల లేఖ మాత్రమే అందిందని స్పష్టం చేసింది. మ్యాజిక్ ఫిగర్ (118) లేనందున గవర్నర్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదని చెబుతున్నారు. దీంతో రేపు విజయ్ ప్రమాణ స్వీకారం లేదని పేర్కొంటున్నారు.

అయితే తమిళనాడు నూతన సీఎంగా విజయ్ రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని టీవీకే అధిష్ఠానం ఓ ప్రకటన చేసింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండబోతుందని చెప్పింది. ఈ మేరకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ చేసిన విన్నపానికి గవర్నర్ ఆమోదం తెలిపారని పేర్కొంది. ఇలాంటి సమయంలో గవర్నర్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దీంతో రేపటి విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>