Mobile Popup Ad
Mobile Popup Ad

విజృంభించిన ఇషాన్ కిషన్.. రాజస్థాన్ టార్గెట్ 217

కలం, స్పోర్ట్స్ : ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌ (SRH vs RR)లో ఇషాన్ కిషన్ విజృంభించాడు. తన క్లాస్ ఆటతో స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తు 91 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ ఇచ్చిన ఊపును క్లాసెన్ కంటిన్యూ చేశాడు. 26 బంతుల్లో 40 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్‌హెచ్ (SRH vs RR) 6 వికెట్ల పతనానికి 216 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) తొలి ఓవర్‌లోనే ఆర్చర్ బౌలింగ్‌లో వెనుదిరిగినప్పటికీ, కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

కిషన్ కేవలం 44 బంతుల్లో 8 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 91 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ (18) నెమ్మదిగా ఆడినా, హెన్రిచ్ క్లాసెన్ (40 పరుగులు, 26 బంతులు, 1 ఫోర్, 3 సిక్సర్లు) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి (28 పరుగులు, 13 బంతులు, 4 సిక్సర్లు), సలీల్ అరోరా (24 నాటౌట్, 13 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో ఆడటంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అనికేత్ వర్మ 6 పరుగులు చేసి రనౌట్ అవ్వగా, హర్ష్ దూబే సున్నా పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎక్స్‌ట్రాల రూపంలో 9 పరుగులు లభించాయి.

రాజస్థాన్ బౌలర్ల విషయానికొస్తే.. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, సందీప్ శర్మ 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ సాధించాడు. తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లలో 55 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకోగా, రియాన్ పరాగ్ కేవలం ఒక ఓవర్ వేసి 5 పరుగులకే ఒక వికెట్ పడగొట్టాడు. నండ్రే బర్గర్ 4 ఓవర్లలో 31 పరుగులు, రవి బిష్ణోయ్ 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చినప్పటికీ వికెట్లు తీయలేకపోయారు. ఓవరాల్‌గా హైదరాబాద్ బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడి 10.80 రన్ రేట్‌తో స్కోరును బోర్డుపై ఉంచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>