యూపీలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల అరెస్ట్‌!

క‌లం వెబ్ డెస్క్: దేశంలో మ‌రోసారి ఉగ్ర క‌ద‌లిక‌లు క‌ల‌క‌లం రేపాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ (Uttar Pradesh)లోని నోయిడాలో యూపీ యాంటీ టెర్ర‌ర్ స్క్వాడ్‌ ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను అరెస్ట్ చేసింది. వీరిని మీర‌ట్‌కు చెందిన తుషార్ చౌహాన్ అలియాస్ హిజ్బుల్లా అలీ ఖాన్‌, ఢిల్లీకి చెందిన స‌మీర్ ఖాన్‌లుగా గుర్తించారు. వీరిద్ద‌రూ పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ మ‌ద్ద‌తున్న గ్యాంగ్‌స్ట‌ర్ల‌తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంబంధాలు కొన‌సాగిస్తున్న‌ట్లు తేలింది. వీరి నుంచి ఒక గ‌న్‌, బుల్లెట్లు, క‌త్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల‌క్నోలోని ఏటీఎస్ పోలీస్ స్టేష‌న్‌లో యూఏపీఏ చ‌ట్టం కింద వీరిపై కేసు న‌మోదు చేశారు.

పాకిస్థాన్‌కు చెందిన కొంద‌రు ఈ యువ‌కుల‌ను సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌భావితం చేసి భార‌త్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. భార‌త్‌లో కీల‌క వ్య‌క్తుల హ‌త్య‌లు, ప్ర‌ముఖ ప్ర‌దేశాల్లో గ్ర‌నేడ్ దాడులు నిర్వ‌హించేందుకు వీరికి రూ.ల‌క్ష‌ల్లో ఆఫ‌ర్ చేసిన‌ట్లు స‌మాచారం. నిందితులు ఇప్ప‌టికే ప‌లువురిని చంపేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు. వీరు టీటీహెచ్‌ పేరుతో నియామకాలు చేపడుతున్నారని దర్యాప్తులో తేలింది. వీరి నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర వ్యక్తుల కోసం పోలీసులు విచారణ వేగ‌వంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>