ఏజెన్సీ టీచర్ల డిప్యూటేషన్లు రద్దు: కలెక్టర్ సంచలన నిర్ణయం!

కలం, నాగర్ కర్నూల్: నాగర్‌ కర్నూల్ (Nagarkurnool ) జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో డిప్టేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు అన్నింటినీ తక్షణమే రద్దు చేస్తున్నట్లు నాగర్ జిల్లా డిఇఓ రమేష్ కుమార్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశాల మేరకు తక్షణం డిప్యూటేషన్లు రద్దు అమలులోకి వచ్చినట్లు తెలిపారు.

ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడకుండా చూడడంతో పాటు, అక్కడి విద్యార్థులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. డిప్టేషన్‌పై మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ జూలై 24 నుంచి తమ అసలు నియామక పాఠశాలలైన ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు కూడా ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించాలని సూచించారు.

ఈ ఆదేశాలను విస్మరించి విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై ప్రభుత్వ నిబంధనల మేరకు శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎటువంటి మినహాయింపులు ఉండవని, ప్రతి ఉపాధ్యాయుడు తక్షణమే తన స్వస్థాన పాఠశాలలో విధుల్లో చేరాలని హెచ్చరించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా బోధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటం, అక్కడి విద్యార్థుల విద్యా హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ ఉపాధ్యాయుల లక్ష్యమని, ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల ఉపాధ్యాయుల డిప్టేషన్‌లను రద్దు చేసి, ఉపాధ్యాయులను తిరిగి వారి అసలు విధి స్థానాలకు పంపిస్తున్నట్లు డిఇఓ రమేష్ కుమార్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>