వరి కొనుగోళ్లపై అధికారులకు ఆదేశాలు

కలం, నిర్మల్: వరి ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేసేందుకు అన్ని జిల్లాల్లో అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ (Surendra Mohan) అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, అధికారులతో హైదరాబాద్ నుంచి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు, డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ (ఫార్మర్ ఐడీ నమోదు) ప్రక్రియలపై ఇతర ఉన్నతాధికారులతో కలిసి విడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. తగినన్ని లారీలు, టార్పాలిన్ లు, గన్నీ సంచులు, హమాలీలు, సామాగ్రి సమకూర్చుకోవాలన్నారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు.

ప్రభుత్వం నిర్ణయించిన ఏడు రకాల సన్న వరి వడ్లు పండించిన రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ అందిస్తామన్నారు. రికార్డుల ప్రకారం 10 లక్షల 50 వేలకు పైగా రైతులు దాదాపు 34 లక్షల 84 వేల ఎకరాల్లో సన్న వరి రకాలు సాగు చేశారని అన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ ద్వారా రైతులకు వ్యవసాయ సంబంధిత అనేక అంశాల్లో ఉపయోగాలు ఉంటాయన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహణలో గ్రామీణ స్థాయిలో స్థానికంగా వ్యవసాయ అంశాలపై అవగాహన ఉన్న వారిని వాలంటీర్లుగా నియమించుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంచార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, వ్యవసాయ అధికారి సుజాత, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>