తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

కలం, వెబ్ డెస్క్: ఉద్యోగులకు (Telangana Employees) తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ ఆరు డీఏల్లో రెండింటిని చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు (CS Sanjay Jaju)తో ఉద్యోగ సంఘాల జేఏసీ (JAC) నాయకులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు అక్టోబర్ ఒకటో తేదీన జరిగే కేబినెట్ సమావేశం ముందు పెట్టబోతున్నట్లు సీఎస్ వివరించారు. అలాగే, పెండింగ్ బకాయిలను విడతల వారీగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, మిగిలిన నాలుగు డీఏలను ప్రకటించబోయే పీఆర్సీతో కలిపి ఇస్తామని కూడా సీఎస్ స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగ సంఘాలు కొంత సంతోషం వ్యక్తం చేశాయి.

నెలకు రూ.2 వేల కోట్లు ఇవ్వాలి..

మిగిలిన డిమాండ్లు కూడా నెరవేర్చాలని సీఎస్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. మరీ ముఖ్యంగా పీఆర్సీని వీలైనంత త్వరగా ప్రకటించాలన్నారు. అలాగే, ప్రస్తుతం రూ.10 వేల కోట్లకు పైగా ఉన్న ఉద్యోగులు, పింఛనర్ల బకాయిలను ప్రతి నెలా రూ.1,000 కోట్ల చొప్పున చెల్లిస్తున్నారని.. దాన్ని రూ.2 వేల కోట్లకు పెంచాలని కోరారు. ఉద్యోగుల(Telangana Employees), పింఛనర్లకు చెరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని విన్నవించారు. కొంత మేర పెంచేందుకు ప్రభుత్వం సైతం అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులు 51 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం ఎంత ఇస్తుందనేది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. త్వరలోనే దీనిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read : రాష్ట్రాల‌కు నూత‌న ఇన్‌చార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన బీజేపీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>