అభిషేక్ పేరిట చెత్త రికార్డు!

కలం, స్పోర్ట్స్​ : ఒక మ్యాచ్‌లో రికార్డు శతకం.. మరో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్. అఫ్గానిస్థాన్‌పై 30 బంతుల్లో శతకం బాదిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. జపాన్‌తో మ్యాచ్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఈ డకౌట్‌తో 2026లో టీ20ల్లో 10 సార్లు డకౌట్ అయిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. సానోలో భారత్, జపాన్ మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఐదు ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లలో 32 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

జపాన్ ఆల్‌రౌండర్ చార్లీ హారా-హింజే బౌలింగ్‌లో అభిషేక్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. జపాన్‌పై డకౌట్‌తో అభిషేక్ ఖాతాలో ఈ ఏడాది టీ20ల్లో 10 డకౌట్లు చేరాయి. దీంతో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక డకౌట్లు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు రషీద్ ఖాన్ 2019లో 9 డకౌట్లు నమోదు చేశాడు. షాదాబ్ ఖాన్ 2024లో 9 సార్లు డకౌట్ అయ్యాడు. ఇప్పుడు అభిషేక్ (Abhishek Sharma) వారిని దాటి 10 డకౌట్లతో ముందున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>