ఏఐ సాయంతో తీర్పులు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఏఐ, చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీ సాయంతో లేని కేసుల్లో తీర్పులను (AI Fake Judgment) సృష్టిస్తున్నారని.. వాటిని న్యాయవాదులు, పిటిషన్ దారులు ఉటంకిస్తున్నారని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఈ నడుమ చాలా ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించింది ధర్మాసనం. తాజాగా బాంబేలో ఓ కంపెనీ డైరెక్టర్ కేసును విచారించిన బాంబే కోర్టు.. అతను అందజేసిన వివరాలు పూర్తిగా ఏఐ సాయంతో క్రియేట్ చేశారని వ్యాఖ్యానించింది. ఇందులో ఓ కేసు వివరాలను కూడా ఉంచారు గానీ.. ఆ కేసు డాక్యుమెంట్లను మాత్రం జత చేయలేదని తెలిపింది.

దీంతో బాంబే కోర్టు వ్యాఖ్యలను తొలగించాలంటూ సదరు డైరెక్టర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. బాంబే కోర్టు చేసిన వ్యాఖ్యలను తాము తొలగిస్తామని.. కానీ ఈ మధ్య ఇలాంటి ఏఐ ఆధారిత పిటిషన్లు ఎక్కువ అవుతున్నాయంటూ సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులతో అందరూ జాగ్రత్తగా ఉండాలని.. టెక్నాలజీని మంచి కోసం వాడాలి తప్ప.. ఇలా కోర్టులను తప్పుదోవ పట్టించడానికి కాదంటూ సుప్రీం (Supreme Court) చెప్పుకొచ్చింది.

Read Also: నిజమైన ప్రేమా? నటనా..? ఎలా గుర్తించాలి ?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>