కలం, మెదక్ బ్యూరో : పెట్రోల్ కొరతపై వస్తున్న పుకార్ల నేపథ్యంలో మెదక్ (Medak) ఎస్పీ డి.వి శ్రీనివాసరావు బంక్ డీలర్లకు కీలక సూచనలు చేశారు. పెట్రోల్, డీజిల్‌ను డబ్బాలు, ప్లాస్టిక్ కంటైనర్లు లేదా వాటర్ బాటిళ్లలో పోయడాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఈ మేరకు బంక్ ప్రాంగణంలో “డబ్బాలలో పెట్రోల్, డీజిల్ పోయడం నిషేధం” అనే బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బంక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి.. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
కొరత ఉందనే కారణంగా పెద్దఎత్తున ఇంధనాన్ని డబ్బాలలో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం అధికంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. జిల్లా (Medak) ప్రజల భద్రత దృష్ట్యా ఎవరు కూడా పెట్రోల్, డీజిల్‌ను ఇంట్లో లేదా ఇతర ప్రదేశాల్లో డబ్బాలలో నిల్వ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేయడం వల్ల లీకేజీలు, అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సంభవించే ప్రమాదం ఎక్కువ ఉందని, ఇంధనం నిల్వ చేసినట్టు తెలిస్తే చట్టపరమైన సమస్యలకు దారితీసే అవకాశముందని ఎస్పీ శ్రీనివాసరావు (SP Srinivasa Rao) హెచ్చరించారు.
Read Also: సైబర్ నేరగాళ్ల వలలో ప్రొఫెసర్.. కోటి రూపాయలు గోవిందా!
Follow Us On: Instagram

