కలం వెబ్ డెస్క్ : తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు(MLA Defection Case) నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్(BRS)లో గెలిచి పార్టీ మారారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై అనర్హత(Disqualification) వేటు వేయాలని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు గత నెల 17న ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పీకర్ స్పందిస్తూ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లు పార్టీ మారలేదని, వారి అనర్హత పిటిషన్లు కొట్టివేశారు. దీనికి సంబంధించిన వివరాలను నేడు సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు.
ఫిరాయింపుల కేసు(MLA Defection Case)లో స్పీకర్ ఇప్పటి వరకు 8 మందిపై విచారణ జరిపారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. కడియం శ్రీహరి ఇప్పటికే తాను పార్టీ మారలేదని రాతపూర్వకంగా స్పీకర్‌కు వెల్లడించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సదరు పదిమంది ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారినా అబద్దాలు చెప్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పీకర్ నివేదికపై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
Read Also: అయోధ్య నుంచి ద్వారక వరకు: సప్త మోక్ష నగరాల ఆధ్యాత్మిక ప్రాధాన్యం
Follow Us On: Youtube


