ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై వ్యాఖ్యానిస్తూ, “మీడియాలో ప్రాచుర్యం పొందడానికి మాత్రమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారు. ఇలాంటి విషయాలు సుప్రీంకోర్టు(Supreme Court) పరిధిలోకి రావు. ముందుగా హైకోర్టును ఆశ్రయించాలి” అని స్పష్టంగా తెలిపింది.
ధర్మాసనం కేఏ పాల్(KA Paul)ను ఉద్దేశించి, “ప్రతీ అంశాన్ని నేరుగా సుప్రీంకోర్టులోకి తీసుకురావడం సరికాదు. మీరు ప్రజాప్రచారం కోసం కోర్టులను వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత కేసును విచారణ నుండి తప్పించింది. కేఏ పాల్ ఇటీవల ఏపీ ప్రభుత్వంపై పలు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. వాటిలో కొన్ని సుప్రీంకోర్టులోనే దాఖలు చేసినా, ధర్మాసనాలు వాటిని విచారణకు అర్హం కాదని తేలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ఆయనపై మరింత చర్చనీయాంశమయ్యాయి.
Read Also: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రం భగ్నం
Follow Us on : Pinterest

