కలం, వెబ్ డెస్క్: శబరిమల ఆలయ అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘కోర్టు టైమ్ వేస్ట్ చేసే ఇలాంటి పిటిషన్ పేపర్లను చెత్తబుట్టలో పడేయాలి’ అని ధర్మాసనం పేర్కొన్నది. శబరిమల మాస్టర్ ప్లాన్ (Sabarimala Development) కింద జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ ఇప్పటికే కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది.
పిటిషనర్ కు కేరళ హైకోర్టు (Kerala High Court) రూ.25వేల జరిమానా కూడా విధించింది. హైకోర్టులో చుక్కెదురైనప్పటికీ మళ్లీ అదే అంశంతో సుప్రీంకోర్టుకు (Supreme Court) రావడాన్ని తప్పుబట్టిన ధర్మాసనం.. ఇలాంటి పత్రాలను డస్ట్‌బిన్‌లో పడేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈ కామెంట్లు కేవలం వ్యాజ్యం, పిటిషనర్ తీరును ఉద్దేశించి చేసినవి మాత్రమేనని, శబరిమల ఆలయ సంప్రదాయాలకు సంబంధించిన ప్రధాన కేసుతో వీటికి సంబంధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Also: దీదీ రాజీనామా చేయకపోతే పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది?
Follow Us On : WhatsApp

