తెలంగాణ రైస్‌ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లకు (Defaulting Rice Millers) సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బకాయిలు, పెండింగ్ బియ్యం అప్పగింతకు సంబంధించిన వ్యవహారంలో మిల్లర్లపై కేసుల నమోదుకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా డిఫాల్ట్ మిల్లర్లపై నమోదైన 540 ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో మిల్లర్ల తరఫున న్యాయవాదులు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. పెండింగ్‌లో ఉన్న బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తే, సంబంధిత బకాయిలను చెల్లించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ పరిణామంతో డిఫాల్ట్ మిల్లర్లపై తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. బకాయిల వసూలు కోసం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వానికి అందించాల్సిన లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం మిల్లర్ల వ్యవహారంలో కీలక పరిణామంగా మారింది. బకాయిల వసూలు, బియ్యం అప్పగింతపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>