సీఎం సభలో విషాదం.. మృతురాలి కుటుంబానికి అండగా మంత్రి పొన్నం!

కలం, మెదక్ బ్యూరో: గురువారం సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సభ అనంతరం, బస్సు కోసం వెళ్తున్న హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటనపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో సారవ్వ పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమవతి నివాళులర్పించారు. అనంతరం సారవ్వ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

తక్షణ సహాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా, సారవ్వ మహిళా సంఘం సభ్యురాలు కావడంతో మహిళా సంఘం సభ్యులకు వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా కూడా అందేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>