కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద, మధ్య తరగతి ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచుతూ, సొంతింటి కలను సాకారం చేస్తోందని విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శుక్రవారం హన్వాడ మండలం టంకర గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు అంటే కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు భరోసా అన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లబ్ధి చేకూర్చి, వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతోందని విప్ యెన్నం పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు పేదల కలకు సాకారం.. ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవంతో కూడిన జీవనం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, పార్టీ నాయకులు, ఎన్.పి.వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, టంకర కృష్ణయ్య యాదవ్, వార్ల గోపాల్ యాదవ్, గూడెం నర్సింహులు యాదవ్, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.

