ఢిల్లీ ఆంక్షలపై విచారణ : సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో విధించిన ఆంక్షలు, నిర్బంధాలపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ (CJP) కార్యకర్తలు, న్యాయవాదుల అక్రమ నిర్బంధాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నిరసనకారులపై జరిగిన ఘటనలను తాము ఎంతమాత్రం తేలికగా తీసుకోబోమని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు.

శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని, జంతర్ మంతర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని కూడా అరెస్టు చేశారని, అలాగే సుప్రీంకోర్టు పరిసరాల్లోనూ సెక్షన్ 144 అమలు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఇంటర్నెట్ నిలిపివేత నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని లాయర్లు వాదనలు వినిపించారు.

అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు (Supreme Court) స్పందిస్తూ తక్షణమే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని, మెట్రో రైలు కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించాలని, అనవసరమైన బారికేడ్లను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తమ విధులకు హాజరవుతున్న న్యాయవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవద్దని హెచ్చరించింది. మెట్రో స్టేషన్ల మూసివేతపై సమగ్ర నివేదిక కోరిన అత్యున్నత న్యాయస్థానం, అక్టోబర్ 10న విధించిన ఆంక్షలపై పూర్తి వివరణతో వచ్చే వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

Also Read : ఢిల్లీలో CJP కీలక నేతల విడుదల.. కాసేపట్లో ప్రెస్‌మీట్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>