కలం, భైంసా: విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ భైంసా (Bhainsa) పట్టణంలోని గుజిరిగల్లిలో గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల అదనపు గదుల నిర్మాణం కోసం దర్బార్ అశోక్ తన తండ్రి రాములు జ్ఞాపకార్థం రూ.20 లక్షల విలువైన స్థలాన్ని గురువారం విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రతినిధులు దాత, ఆయన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని, పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అశోక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు, విభాగ్, జిల్లా, పాఠశాల కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

